భారతదేశం, ఫిబ్రవరి 21 -- తెలంగాణ హైకోర్టులో ఫిబ్రవరి 20వ తేదీ గురువారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీంట్లో బీఆర్ఎస్ చీఫ్ కె.చంద్రశేఖర్ రావు ప్రతిపక్ష నాయకుడిగా తన విధిని నిర్వర్తించడానికి అసెంబ్లీకి హాజరయ్యేలా చూడాలని.. గైర్హాజరైతే ఆయనను ఎమ్మెల్యేగా అనర్హులుగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్, ఆయన కార్యదర్శిని ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు.

"ప్రజలు తనకిచ్చిన బాధ్యతను తప్పించుకుంటే ఎలా. కేసీఆర్‌ను శాసనసభ్యుడిగా అనర్హులుగా ప్రకటించండి" అని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉంటే.. మరొకరిని ఎల్ఓపీగా నామినేట్ చేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించాలని.. రైతు సంఘాల సమాఖ్య ప్రతినిధి డి.విజయ్‌పాల్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. "ప్రజలకు సంబంధించిన సమస్యలను, ముఖ్యంగా రైతు...