భారతదేశం, మార్చి 6 -- Kazipet Train: కాజీపేట - బల్లార్షా (17035), బల్లార్షా - కాజీపేట(17036) రైలును రైల్వే మంత్రిత్వ శాఖ పునరుద్ధరించింది. గతంలో అజ్నీ ప్యాసింజర్ గా పిలిచే ఈ ప్యాసింబర్ సేవలను దాదాపు రెండేళ్ల కిందట దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేయగా.. ఇక్కడి ప్రయాణికుల సౌకర్యార్థం అందిన వినతుల మేరకు రైల్వే శాఖ మళ్లీ సేవలను ప్రారంభించింది.

గతంలో అజ్నీ ప్యాసింజర్ గా ఉన్న ఈ ట్రైన్ ను కాజీపేట-బల్లార్షా ఎక్స్ ప్రెస్ గా మార్చి సేవలను పునరుద్ధరించింది. ఈ మేరకు గురువారం నుంచి గతంలో మాదిరిగానే ఈ రైలు సేవలు అందుబాటులోకి రానుండటంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

కాజీపేట జంక్షన్ నుంచి ప్రతి రోజు రాత్రి 10.50 గంటలకు బయలుదేరే కాజీపేట--బల్లార్షా(17035) ఎక్స్ ప్రెస్ ఉదయం 3.50 గంటలకు బల్...