Hyderabad, మార్చి 16 -- Kayadu Lohar Created Memes On Herself: తెలుగులోకి ఎప్పుడు ఎవరో ఒక కొత్త హీరోయిన్ అడుగుపెడుతూనే ఉంటారు. అలా, రీసెంట్‌గా టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటి కయాదు లోహర్. దర్శకుడిగా, హీరోగా అలరించిన ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్.

ఈ డ్రాగన్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్‌తోపాటు కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలై అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన డ్రాగన్ రిలీజ్ అయిన తొలి 10 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా దాదాపుగా 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లతో డ్రాగన్ సినిమా దూసుకుపోతోంది. అయితే, డ్రాగన్ మూవీ రిలీ...