భారతదేశం, ఏప్రిల్ 14 -- సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ ఐపీఎల్‌లో చాలా ఫేమస్. ఎస్ఆర్‌హెచ్ గెలిచినప్పుడు, ఓడినప్పుడు ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కి అందరూ ఫీదా అయిపోతారు. ఓ స్టేజీ మీద రజనీకాంత్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారంటే ఎంత వైరల్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ వ్యాపార కుటుంబంలో జన్మించిన ఆమె ఎంబీఏ పూర్తి చేశారు. 2018లో ఎస్ఆర్‌హెచ్ సీఈవో అయ్యారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ ఐపీఎల్‌లో ప్రముఖ వ్యక్తిగా మారారు. ఆగస్టు 6, 1992న జన్మించారు. ఆమె తండ్రి కళానిధి మారన్ సన్ గ్రూప్ చైర్మన్, వ్యవస్థాపకుడు. ఆమె తల్లి కావేరి మారన్ సోలార్ టీవీ కమ్యూనిటీ లిమిటెడ్‌కు సీఈవో. కావ్య సన్ గ్రూప్ వ్యాపార కార్యకలాపాలలో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది. సన్ టీవీ నెట్‌వర్క్ వెనుక ఉన్న శక్తిగా ఆమె దేవి అవార్డ్స్ 2024ను కూడా అందుకుంది.

కావ్య మ...