New Delhi, జూలై 29 -- బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఫిట్‌నెస్ కు పెట్టింది పేరు. కత్రినా రోజువారీ ఆహారం, జీవనశైలి గురించి ఆమె సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా చెప్పారు. కత్రినాకు ఆహారమే ఔషధమని, తన శరీర పోషకాహార అవసరాలను ఆమె గుర్తుంచుకుంటారని, సరైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తనకు తెలుసని ఆమె చెప్పారు. శరీర పోషక అవసరాలు తెలుసు కాబట్టి, ఆమె కొన్ని సప్లిమెంట్లు, జ్యూసులు, లేదా ఐరన్ రిచ్ ఫుడ్స్ కోసం తన న్యూట్రీషనిస్టును సంప్రదిస్తుందట.

ఆమె డైట్ ప్లాన్ సింపుల్ గా ఉంటుంది. కత్రినా ఇంట్లో వండిన భోజనాన్నే ఎక్కువగా ఇష్టపడుతుంది. 41 ఏళ్ల ఈ నటి బయటి ఆహారాన్ని ఎప్పుడూ తినదు. ఆమె ఎక్కడికి వెళ్లినా ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తనవెంట తీసుకువెళ్తుందట. కత్రినా కైఫ్ చాలా సాంప్రదాయ పద్ధతులు పాటిస్తుంది. ఆయిల్ పుల్లింగ్, నాసికలను శుభ్...