Hyderabad, మార్చి 30 -- Katha Sudha OTT Release: ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. వివిధ జోనర్లలో అవి ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు వీటన్నింటికి భిన్నంగా సరికొత్తగా కథా సుధ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ప్రతి ఆదివారం సరికొత్త ఎపిసోడ్‌తో కథా సుధ ఓటీటీ రిలీజ్ కానుంది.

'కొత్తవారిని తయారు చేయడంలో ఆనందం వేరు. మంచి కథలకు, కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడానికి కథా సుధ గొప్ప వేదిక' అని దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు అన్నారు. కే రాఘవేంద్రరావు, దర్శకుడు సతీష్ వేగేశ్న సూపర్ విజన్‌లో కథా సుధ తెరకెక్కింది. ఈటీవీ విన్‌‌లో ఏప్రిల్ 6 నుంచి కథా సుధ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ప్రతి అదివారం ఓ అద్భుతమైన కథతో అలరించబోతోంది.

'కథా సుధ' కి సంబధించిన టైటిల్, ప్రోమో లాంచ్ ఈవెంట్ శనివారం (మార్చి 29) నాడు గ్ర...