భారతదేశం, మార్చి 20 -- కార్తీక దీపం 2 నేటి (మార్చి 20) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న నిశ్చితార్థానికి కార్తీక్ రెస్టారెంట్‍కు క్యాటరింగ్ ఆర్డర్ ఇస్తుంది పారిజాతం. పేరు, ఫోన్ నంబర్ రాసి మేనేజర్‌కు ఇస్తుంది. ఆర్డర్ క్యాన్సిల్ చేయడాలు లాంటివి ఉండవు కదా అని పారు అడుగుతుంది. మా తరఫు నుంచి క్యాన్సల్ చేస్తే డబుల్ పేమెంట్ తిరిగిస్తామని, ఇది కార్తీక్ పెట్టిన రూల్ అని మేనేజర్ చెబుతాడు. అక్కడి నుంచి పారు వెళుతుంది.

ఇంతలోనే కార్తీక్, దీప సైకిల్‍పై రెస్టారెంట్‍కు వస్తుంటారు. వారిని చూసి జ్యోత్స్న కంగారు పడుతుంది. ఇంకా పారిజాతం రాలేదేంటని టెన్షన్ పడుతుంది. ఇంతలోనే పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వస్తుంది. కారు ఎక్కుతుంది. కార్తీక్ కంట పడకుండా తప్పించుకుంటుంది. వెంటనే కారెక్కాలని పారుతో అంటుంది జ్యోత్స్న. ఆర్డర్ కన్ఫర్మ్ అయింది కదా అని జ్యోత్స్న.. అ...