భారతదేశం, మార్చి 19 -- కార్తీక దీపం 2 నేటి (మార్చి 19)లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న నిశ్చితార్థానికి కాంచనను పిలుద్దామంటే.. వద్దేవద్దంటాడు శివన్నారాయణ. నేను ఎవరిని చెప్పానో వాళ్లే రావాలి వస్తారు.. నాకు ఒక్కడే కొడుకు, ఒక్కరే మనవరాలు అని అంటాడు. దీంతో దశరథ్, సుమిత్ర బాధపడతారు. నువ్వెందుకు ఏడుస్తావ్.. మీ మామయ్య చెప్పింది నిజమేనని సుమిత్రతో పారిజాతం అంటుంది. నువ్వు తాతలా మాట్లాడొద్దని జ్యోత్స్న చెబుతుంది.

నిశ్చితార్థానికి, పెళ్లికి అత్త ఫ్యామిలీ రావాలని మమ్మీ, డాడీ కోరుకుంటున్నారు.. వాళ్లు వచ్చేలా నేను చేస్తానని జ్యోత్స్న. తాతను నేను ఒప్పిస్తానని అంటుంది. ఎలా ఒప్పిస్తావని సుమిత్ర అడుగుతుంది. తాను అత్త ఇంటికి వెళ్లివచ్చానని జ్యోత్స్న చెబుతుంది. కాంచన నీతో మాట్లాడిందా అని దశరథ్ అడిగితే.. వాళ్లంతా హ్యాపీ డాడీ అని జ్యోత్స్న. మీరు పిలవండి.. అఫీషియ...