భారతదేశం, మార్చి 18 -- కార్తీక దీపం 2 నేటి (మార్చి 18) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. పెళ్లి చూపుల్లో జ్యోత్స్న కూర్చుకుంటుంది. అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడగండి అని గౌతమ్ తల్లిదండ్రులతో దశరథ్ అంటాడు. ఇద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి వీడి గురించి ఎక్కువే తెలిసి ఉంటుందని జ్యోత్స్నతో గౌతమ్ తల్లి అంటుంది.

మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు..నీకు ఈ పెళ్లి ఓకే కదా అని జ్యోత్స్నను గౌతమ్ తండ్రి అడుగుతాడు. పెళ్లికి ఓకే అని జ్యోత్స్న చెబుతుంది. దీంతో పారిజాతం, శివన్నారాయణ, దశరథ్, సుమిత్ర సంతోషిస్తారు. అమ్మాయికి, అబ్బాయికి ఓకే.. మమ్మల్ని ఏమైనా అడగాల్సి ఉంటే చెప్పండని గౌతమ్ తల్లి అంటుంది.

నా యావదాస్తికి వారసురాలు నా మనవరాలు అని శివన్నారాయణ చెబుతాడు. జ్యోత్స్న అని చెప్పవచ్చు కదా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కట్నకానుకలు అడగపోయినా ఇస్తామని దశరథ్ అంటాడు. అయితే, ఇంక ముహ...