భారతదేశం, మార్చి 17 -- కార్తీక దీపం 2 నేటి (మార్చి 17) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీపకు గాజులు తొడుగుతాడు కార్తీక్. దీంతో దీప మురిసిపోతుంది. గాజులు ఎలా ఉన్నాయని కార్తీక్ అంటే.. చాలా అందంగా ఉన్నాయని దీప చెబుతుంది. ఏంటో విచిత్రం గాజులు వేస్తే చేతికి అందం రావాలని కానీ, ముఖానికి వచ్చిందని నవ్వుతూ కార్తీక్ పొగుడుతాడు. నా ముఖం మీద మెరుస్తున్న అందం మీ మంచితనం కార్తీక్ బాబు. తాను రెస్టారెంట్‍కు వెళతామని కార్తీక్ చెబితే.. తాము వస్తామని కాంచన, అనసూయ మాట్లాడుతుంటారు. ఇంతలో శ్రీధర్ అక్కడికి వస్తాడు.

శుభవార్త అని కావేరితో స్వప్న ఫోన్‍లో చెప్పిన విషయం విని.. కార్తీక్‍కు శివన్నారాయణ ఆస్తి రాసిచ్చాడని తప్పుగా అర్థం చేసుకొని ఉంటాడు శ్రీధర్. దీంతో స్వీట్లు పట్టుకొని కొడుకు కార్తీక్ ఇంటికి వస్తాడు. సాయంగా ఉండేందుకు రెస్టారెంట్‍కు వస్తామని, ఇంట్లో ఉండి ఏం చ...