భారతదేశం, మార్చి 15 -- కార్తీక దీపం 2 నేటి (మార్చి 15) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్నను ఎన్నిసార్లు తిట్టినా మారలేదని కార్తీక్ అంటాడు. నీ మీద, శౌర్యపై కూడా అటాక్ చేయించింది, ఆ రకంగా అయినా మిమ్మల్ని అడ్డుతొలగించి నా జీవితంలోకి వచ్చేందుకు జ్యోత్స్న ట్రై చేసిందని దీపతో కార్తీక్ చెబుతాడు. రీసెంట్‍గా క్యాటరింగ్ వద్ద అలా చేసిందని అంటాడు. ఇన్ని అరాచకాలు చేసిన జ్యోత్స్న మారిపోయిందంటే ఎలా నమ్మమంటావ్ అని కార్తీక్ అంటాడు. కాలం గొప్పదని, అందరినీ ఏదో ఒక రోజు వాస్తవంలో నిలబెడుతుందని దీప అంటుంది.

జ్యోత్స్నకు జ్ఞానోదయం అయిందని అనుకుంటున్నావా అని కార్తీక్ అంటే.. ఎందుకు కాకూడదని అంటుంది దీప. దక్కని దాని కోసం ఎంత కాలం ఎదురుచూస్తుందని అంటుంది. క్యాటరింగ్ దగ్గర మీరు చెప్పారు కదా.. ఆ మాటలు తన మీద పని చేసి ఉండొచ్చని అంటుంది. ఇంటికి వెళ్లి ఆలోచించి అర్థం ...