భారతదేశం, ఫిబ్రవరి 1 -- కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ (ఫిబ్రవరి 1)లో ఏం జరిగిందంటే.. శౌర్య ఆపరేషన్‍కు డబ్బు ఎలా అని బాధగా కూర్చొని ఉంటుంది దీప. ఆపరేషన్‍కు నాలుగు గంటలే ఉందని, డబ్బు తెచ్చారా అని కార్తీక్‍కు అడుగుతుంది. డబ్బులు కట్టారా అని నర్స్ అడిగిందని చెబుతుంది. డబ్బు కట్టేశానని కార్తీక్ అంటాడు. అంత డబ్బు ఎలా వచ్చిందని కార్తీక్‍ను అడుగుతుంది. తాను రూ.4లక్షలే కట్టానని కార్తీక్ చెబుతాడు. కట్టాల్సింది రూ.45లక్షలు కదా అని దీప అడుగుతుంది. ఇంకా రూ.41లక్షలు కట్టాలి కదా అని టెన్షన్ పడుతుంది. మనకు నాలుగు గంటలే మిగిలాయని అంటుంది.

శౌర్య ఏడుస్తోందని నర్స్ చెబుతుంది. దీంతో కార్తీక్, దీప వెళతారు. ఇంజక్షన్ వేస్తానని నర్స్ చెప్పిందని, మీరు ఉంటేనే ఇండక్షన్ తీసుకుంటానని అన్నానని శౌర్య చెబుతుంది. ఇంటికి ఎప్పుడు వెళదామని అడుగుతుంది. పెద్ద పరీక్ష అయిపోయాక వె...