భారతదేశం, మార్చి 12 -- కార్తీక దీపం 2 నేటి (మార్చి 12) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. ఇప్పుడు మీ తాత శివన్నారాయణపై కేసు పెట్టకపోతే కోట్ల ఆస్తి చేజారిపోతుందని కొడుకు కార్తీక్‍తో అంటాడు శ్రీధర్. మా అమ్మే ఆస్తి వద్దనుకుందని, నాదీ అదే మాట అని కార్తీక్ చెబుతాడు. ఆస్తి కోసం తాతపై కేసు వేయబోనని అంటాడు. పేపర్లపై ఒక్క సంతకం పెడితే అంతా తాను చూసుకుంటానని శ్రీధర్ అంటాడు. మనకు రాసిపెట్టి లేని దాని గురించి ఆలోచించకూడదని కార్తీక్ అంటాడు. మనవడిగా నీకు హక్కు ఉందిరా అని శ్రీధర్ అంటే.. అది నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదంటాడు కార్తీక్.

"దీప మీ ఆయనకు నువ్వైనా చెప్పమ్మా.. వచ్చే డబ్బుతో రెస్టారెంట్ పెట్టుకోవచ్చు. మంచి ఇల్లు కొనొచ్చు. నా అప్పు తీర్చొచ్చు. శివన్నారాయణ మీద మీ ఆయన చేసి శపథం గెలవొచ్చు. ఇవన్నీ ఒక్క సంతకంతో జరుగుతున్నాయంటే అద్భుతంగా కదా" అని శ్రీధర్ ...