భారతదేశం, మార్చి 11 -- కార్తీక దీపం 2 నేటి(మార్చి 11) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. ఆస్తులపై శివన్నారాయణ రాసిన వీలునామాను సిద్ధం చేసి తీసుకొని వస్తాడు లాయర్ వినాయక రావు. "ఆ ఆస్తి మొత్తం ఎందరి పేరున రాశాడో. కొడుకుకు ఏం రాశాడో, కూతురుకు ఏం రాశాడో.. మనరాలికి ఏం రాశాడో.. నాకేం రాశాడో" అని మనసులో కంగారు పడుతుంది పారిజాతం. "బావ పేరు మీద కూడా ఆస్తి రాసి ఉంటాడా.. లేదులే నేను ఇష్టమైన మనవరాలిని కదా నా పేరు మీదే రాసి ఉంటాడు" అని జ్యోత్స్న అనుకుంటుంది. దశరథ్, సుమిత్ర కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వీలునామా చదవాలని లాయర్ వినాయక రావుతో శివన్నారాయణ అంటాడు.

ఆస్తి పంపకాల గురించి శివన్నారాయణ రాసిన వీలునామాను లాయర్ చదువుతాడు. "నా యావదాస్తిని కొడుకు దశరథ్‍కు, అతడి భార్య సుమిత్రకు, వాళ్లకు పుట్టిన బిడ్డకు చెందేటట్టుగా రాస్తున్నాను" అని శివన్నారాయణ రాసినట్టు వీ...