భారతదేశం, ఏప్రిల్ 9 -- కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 9) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. గౌతమ్ తనను బెదిరించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది దీప. రెస్టారెంట్‍లో కోపంగా కూరగాయలు తరుగుతూ ఉంటుంది. "వాడికి ఎంత ధైర్యం కాకపోతే.. తప్పు చేసింది కాక నాకే వార్నింగ్ ఇస్తాడా" అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. ఎందుకు కోపంగా ఉన్నావని అడుగుతాడు. కానీ గౌతమ్ ఇంటికి వచ్చి బెదిరించిన విషయాన్ని దీప చెప్పదు. ఏం లేదు కార్తీక్ బాబు అంటుంది. మరి ఎందుకు ఇలా ఉన్నావని కార్తీక్ బాబు అడుగుతాడు.

ప్రేమ భాషను నేర్పాలని దీపను కార్తీక్ అడుగుతాడు. తనకు ఆ భాష రాదంటుంది దీప. కోనేటి దగ్గర నిన్ను హగ్ చేసుకోవాలని అనిపించింది దీప అని కార్తీక్ అంటాడు. నువ్వే ప్రాణదాతవు అని చెప్పిన తర్వాత ప్రేమగా హగ్ చేసుకొని, నా ఫీలింగ్స్ బాగా చెప్పాలనుకున్నానని చెబుతాడు. ఒకట...