భారతదేశం, ఏప్రిల్ 7 -- కార్తీక దీపం 2 సీరియల్ నేటి (ఏప్రిల్ 7) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దాసు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఫోన్ చేయాలని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఇంతలో దశరథ.. దశరథ అంటూ ఉత్సాహంగా అరుస్తూ ఉంటాడు శివన్నారాయణ. ఫోన్ పెట్టేస్తుంది పారు. ఏదో అయిందని అనుకుంటుంది. ఇంతలో ఏమైంది నాన్న అని దశరథ్ అడుగుతాడు. గుడ్‍న్యూస్ అంటాడు శివన్నారాయణ.

గౌతమ్ తనకు కాల్ చేశాడని ఆనందంగా అంటాడు శివన్నారాయణ. రింగ్ విసిరేసి వెళ్లాడు కదా అని విసుగ్గా అంటుంది పారు. అలా చేసిందుకే గౌతమ్ తనకు సారీ చెప్పాడని, ఎవరో నా మీద నిందేశారని బాధపడ్డానని అన్నాడని శివన్నారాయణ చెబుతాడు. జ్యోత్స్నను పెళ్లి చేసుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని గౌతమ్ చెప్పాడని, ఒకే అనుకుంటే పెళ్లికి ముహూర్తాలు పెట్టించమన్నాడని అంటాడు. దీంతో పారిజాతం, సుమిత్ర కూడా సంతోషిస్తారు.

గ...