భారతదేశం, ఏప్రిల్ 23 -- కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 23, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీపను కోర్టు దగ్గరికి తీసుకొస్తారు పోలీసులు. అక్కడే ఉన్న కార్తీక్, కావేరి దగ్గరికి దీప వెళుతుంది. దీప ఇదంతా నా వల్లే.. నేను చూసింది నీకు చెప్పకుండా ఉండాల్సిందని కావేరి అంటుంది. దీంట్లో ఎవరి తప్పు లేదు.. ఇదంతా నా తలరాత అని దీప చెబుతుంది. ఎవరో రాసిన రాతలను నీ తలరాత అనుకోవద్దు.. వాటిని నేను మారుస్తా అని దీపతో కార్తీక్ అంటాడు.

శౌర్య అని దీప అడిగితే ఇంటి దగ్గరే ఉండాలన్నానని చెబుతాడు. అమ్మ, అనసూయను కూడా రావొద్దన్నానని, నిన్ను ఇలా చూడడం ఎవరికి ఆనందంగా ఉండదని అంటాడు. ఇంతలో కోర్టు దగ్గరికి శివన్నారాయణ, సుమిత్ర, పారిజాతం వస్తారు. దీప, కార్తీక్‍ను కోపంగా చూస్తారు. ఇప్పుడు అన్నయ్యకు ఎలా ఉందని వదినా అని సుమిత్రను కావేరి అడుగుతుంది. ఎలా ఉందో నీ పక్కన ఉన్న మనిషిని...