భారతదేశం, ఏప్రిల్ 22 -- కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 22) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. కారు వచ్చి ఆగడంతో అమ్మ వచ్చిందా అని కార్తీక్‍ను శౌర్య అడుగుతుంది. కారులో నుంచి జ్యోత్స్న దిగుతుంది. ఈవిడ ఎందుకు వచ్చిందనుకున్న కార్తీక్.. శౌర్యను లోపలికి వెళ్లాలని చెబుతాడు. హాయ్ బావా అని జ్యోత్స్న అంటే.. ఎందుకు వచ్చావని కోపంగా అంటాడు. ఇంక నువ్వు దీపను కాపాడే ప్రయత్నాలు చేయవద్దని చెప్పేందుకు వచ్చానని జ్యోత్స్న అంటుంది. వీరి మాటలు తలుపుచాటున ఉండి వింటూ ఉంటుంది శౌర్య.

"డాడీ (దశరథ్) దగ్గర రిపోర్ట్ రాసుకోవడానికి ఎస్ఐ వచ్చారు. దీపే నన్ను షూట్ చేసిందని డాడీ చెప్పాడు. ఈ ఒక్క ఆధారం చాలు కదా దీప జైలుకు వెళ్లేందుకు" అని జ్యో చెబుతుంది. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. నువ్వు ఇంట్లో వాళ్లకు అబద్ధం చెప్పొచ్చు.. కానీ నిజం నువ్వైనా అర్థం చేసుకోవాలని జ్యోత్స్న చెబుతుంది. దీ...