భారతదేశం, ఏప్రిల్ 16 -- కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 16, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీపను జైలును నుంచి బయటికి రాకుండా చేయాలని సుమిత్ర అంటుంది. ఆ దీప మళ్లీ ఇంటి ముఖం చూడకూడదు సుమిత్ర, దాని బతుకు జైలులోని గడిచిపోవాలని పారిజాతం అంటుంది. జరగబోయేది అదే గ్రానీ అని జ్యోత్స్న చెబుతుంది. తాతా.. పోదాం పదా అని అంటుంది. నేను ఎక్కడికీ రాలేను.. కొడుకు దగ్గరే ఉంటానని ఏడుస్తాడు శివన్నారాయణ. దశరథ్‍ బదులు దీప నన్ను కాల్చినా బాగుండేదంటూ నాటకాలు ఆడుతుంది పారిజాతం. దీప.. విశ్వాసం లేని ఆయుధం అని సుమిత్ర అంటుంది. సాయం చేసిన చేతికే గాయం చేసిందని మాట్లాడుతుంది.

తప్పు దీపది కాదు.. మనది అని సుమిత్ర అంటుంది. సరి చేసుకుందాం మమ్మీ అని జ్యోత్స్న చెబుతుంది. దీప చేయాల్సింది చేసింది.. మనం చేయాల్సింది చేయాలి అని అంటుంది. "దాని కూతురు జోలికి వస్తే భర్తనైనా చంపడానికి ...