భారతదేశం, ఏప్రిల్ 14 -- కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 14) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. బుల్లెట్ గాయమైన దశరథ్‍కు ఆసుపత్రిలో ఆపరేషన్ జరుగుతుంటుంది. శివన్నారాయణ, సుమిత్ర, జ్యోత్స్న, పారిజాతం ఏడుస్తూ ఉంటారు. నర్స్ బయటికి రావటంతో మా వాడికి ఎలా ఉందమ్మా అని శివన్నారాయణ అడుగుతాడు. "ఆపరేషన్ జరుగుతోంది. కండీషన్ చాలా సీరియస్‍గా ఉంది" అని నర్స్ చెబుతుంది. దీంతో శివన్నారాయణ, సుమిత్ర మరింత కంగారు పడతారు. కన్నీళ్లు పెట్టుకుంటారు. డాడీకి ఏమవదు.. మమ్మీ అని సుమిత్రను ఓదారుస్తుంది జ్యోత్స్న.

మామయ్య దశరథ్‍కు ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆసుపత్రికి వస్తాడు కార్తీక్. మావయ్యకు ఎలా ఉందని తాత శివన్నారాయణను అడుగుతాడు. ముందు నువ్వు బయటికి వెళ్లు అంటూ శివన్నారాయణ ఫైర్ అవుతాడు. ఎలా ఉందని కార్తీక్ మళ్లీ అడిగితే.. పోరా బయటికి అంటూ తోసేస్తాడు. కొట్టినా పర్లేదు మామయ్యకు ఎలా ఉం...