భారతదేశం, ఏప్రిల్ 21 -- కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 21, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. నీకోసం ఎవరూ వచ్చేలా లేరు, తినేందుకు ఏమైనా తీసుకురావాలా అని జైలులో ఉన్న దీపను కానిస్టేబుల్ అడుగుతుంది. వద్దు అని, దశరథ్‍కు ఎలా ఉందో చెప్పాలని దీప ప్రశ్నిస్తుంది. ఆయన లేచే వరకు వరకు తినావా అని కానిస్టేబుల్ అడిగితే.. ఆయన నాకు తండ్రి లాంటి మనిషి అని దీప అంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా గుండెల్లో కాల్చావ్ అని కానిస్టేబుల్ అంటుంది. ఇంతలో క్యారేజీ పట్టుకొని పోలీస్ స్టేషన్‍కు వస్తాడు కార్తీక్.

మీ ఆవిడకు ఆకలి లేదంట.. క్యారేజ్ అక్కడ పెట్టి వెళ్లాలని కార్తీక్‍తో కానిస్టేబుల్ చెబుతుంది. కొన్ని చెబితే ఆకలి గుర్తు రావొచ్చని కార్తీక్ అంటాడు. తమ ఇంటికి గురించి, అందరి గురించి చెబుతాడు. శౌర్య కూడా తినిందని తన మాటల్లో అంటాడు. నువ్వు తింటేనే నీ భర్త ఇక్కడి నుంచి నీ భర్త...