భారతదేశం, ఫిబ్రవరి 28 -- కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 28) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీపే అసలైన వారసురాలు అని దాసు నిజం చెప్పేస్తే తన పరిస్థితి ఏంటి అని జ్యోత్స్న ఆలోచిస్తుంది. ఏదో టైమ్ బాగుండి సేవ్ అవుతున్నానని, లేకపోతే జైలులో కూర్చునే దాన్ని అని అనుకుంటుంది. బావ, ఆస్తి, బతుకుపోయి అప్పుడు ఎవరి కోసం బతకాలి అని రగిలిపోతుంది. దాసును చంపేందుకు తాను చేసిన ప్రయత్నాలు, తనపై అనుమానంతో దశరథ్ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటుంది జ్యోత్స్న.

దాసుకు ఎప్పుడు గతం గుర్తొస్తుందో అని జ్యోత్స్న కంగారు పడుతుంది. "తాత (శివన్నారాయణ) ఏమో పెళ్లి అంటున్నాడు. డాడీ ఏమో దాసు కోలుకునే వరకు ఆగమనంటున్నాడు. ఇదేదో నా చావుకు వచ్చేలా ఉంది" అని జ్యోత్స్న అనుకుంటుంది.

దాసు నోటిలో నుంచి నిజం వచ్చేలోపే దీప చచ్చిపోతే.. వారసురాలు లేదు కాబట్టి గ్రానీతో చెప్పి నాన్న నోరు మూయిం...