భారతదేశం, ఫిబ్రవరి 18 -- కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 18) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. కార్తీక్, దీప కలిసి తులసి కోట వద్ద దీపారాధన చేస్తారు. ఏం మొక్కుకున్నావో ఇప్పుడైనా చెప్పు అని కార్తీక్ అడుగుతాడు. మీ కోసమే బాబు అని దీప బదులిస్తుంది. మీకు మంచి అవకాశం వచ్చి.. ఎవరికీ అందనంత ఎత్తు ఎదగాలని మొక్కుకున్నానని దీప చెబుతుంది. దేవుడిని ఇంత గట్టిగా అడిగావంటే నీ కోరిక తీర్చకుండా ఉంటాడా, తప్పకుండా తీరుస్తాడని కార్తీక్ అంటాడు. శౌర్య ప్రాణాలు నిలిచేందుకు మీరే అని, ఆయన గెలుపుకు సాయంగా ఉండాలని మనసులో దేవుడిని కోరుకుంటుంది దీప.

ఉదయాన్ని కార్తీక్‍కు కాఫీ తీసుకొస్తుంది దీప. ఇడ్లీ బండి దగ్గరికి నన్ను రానివ్వడం లేదు కదా.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పెట్టాలని అనుకుంటున్నానని దీపతో కార్తీక్ చెబుతాడు. బస్టాండ్ పక్కన ఓ ప్లేస్ చూసివచ్చానని, మున్సిపాలిటీ వాళ్లతో ఓ మాట చెప్...