భారతదేశం, ఫిబ్రవరి 17 -- కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 17) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. తప్పుడు లెక్కలు రాసి బిజినెస్‍లో నష్టాలను లాభాలుగా చూపించాలని అకౌంటెట్‍తో ఫోన్‍లో మాట్లాడుతుంది జ్యోత్స్న. నిజం ఎవరికీ తెలియకూడదని అంటుంది. వెనుక నుంచి ఆ మాట విన్న దశరథ్ ఎన్ని నిజాలని దాస్తావ్ జ్యోత్స్న అని దశరథ్ అంటాడు. తప్పును దాచాలని అనుకుంటే.. అది చాలా తప్పులను చేయిస్తుందని చెబుతాడు. "డాడీ మాట్లాడుతుంది ఫోన్ కాల్ వినా.. లేకపోతే దాసు గురించా" అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అడుగుతుంది.

కొన్ని రోజుల నుంచి నేనోదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారని జ్యోత్స్న అంటుంది. నా మాటలు నీకు అర్థం కావడం లేదా జ్యోత్స్న అని దశరథ్ అడుగుతాడు. లేదంటూ జ్యోత్స్న అంటుంది. దేని గురించి అబద్ధం చెప్పానని అడుగుతుంది. దేని గురించి నిజం చెప్పలేకపోత...