భారతదేశం, ఫిబ్రవరి 15 -- కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 15) ఎపిసోడ్‍లో.. కార్తీక్, దీప క్యాటరింగ్ చేస్తున్న ఫంక్షన్‍కే వస్తారు శ్రీధర్, జ్యోత్స్న, పారిజాతం. నీ కొడుకు ఎక్కడున్నాడని, లండన్‍కు వెళ్లాడా అని ఫంక్షన్ నిర్వహిస్తున్న గంగాధర్ అడిగితే.. కార్తీక్ గురించి గొప్పలు చెబుతాడు శ్రీధర్. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. శ్రీధర్ ఏం చెబుతాడా అని జ్యోత్స్న, పారిజాతం చేస్తుంటారు. మౌనంగా ఉన్నావ్ నీ కొడుకు పేరు ఏంట్రా అని స్నేహితుడు శ్రీధర్‌ను గంగాధర్ అడుగుతాడు. కార్తీక్ అని జ్యోత్స్న సమాధానమిస్తుంది. ఇంతలో ఎక్కడికి వెళ్లారనుకుంటూ.. కార్తీక్ బాబు అని దీప పిలుస్తుంది.

ఈ క్యాటరింగ్ అబ్బాయి పేరు కూడా నీ కొడుకు పేరే అని గంగాధర్ అంటాడు. "మీరు ఇంకో విచిత్రం కూడా చూడాలి. ఈ క్యాటరింగ్ అబ్బాయే.. వీళ్ల అబ్బాయి" అని పారిజాతం అంటుంది. దీంతో గంగాధర్ షాక్ అవు...