భారతదేశం, ఏప్రిల్ 2 -- కార్తీక దీపం 2 సీరియల్ స్టార్ మా ఛానెల్‍లో రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం.. జ్యోత్స్న నిశ్చితార్థాన్ని అడ్డుకున్న దీప నిందలు ఎదుర్కొంటూ ఉంది. జ్యోత్స్న జీవితాన్ని కాపాడదామని అనుకున్న దీపకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గౌతమ్ చేసిన తప్పులను సాక్ష్యాలతో పాటు నిరూపించేందుకు దీప తంటాలు పడుతోంది. మరోవైపు జ్యోత్స్న కుట్రలు చేస్తూనే ఉంది. శివన్నారాయణ, సుమిత్ర దీపపై కోపం పెంచేసుకున్నారు. ఈ క్రమంలో కార్తీక దీపం 2 సీరియల్‍ నేటి (ఏప్రిల్ 2, 2025) ఎపిసోడ్‍లో కొత్త క్యారెక్టర్ వచ్చింది. ఈ పాత్ర రాగానే దీపకు షాక్ ఎదురైంది.

కార్తీక దీపం 2 సీరియల్‍లో సత్తిపండు అనే కొత్త పాత్ర వచ్చింది. ఇంటి రామాయణం సీరియల్‍తో పాపులర్ అయిన నటుడు కల్యాణ్ చక్రవర్తి.. కార్తీక దీపంలో సత్తిపండు ఈ పాత్ర పోషిస్తున్నారు. గౌతమ్ చేతిలో మోసపోయిన రమ్య ఉండ...