భారతదేశం, ఏప్రిల్ 13 -- స్టార్ మా టీవీ ఛానెల్ సీరియల్ 'కార్తీక దీపం 2'లో భారీ ట్విస్ట్ ఎదురైంది. గౌతమ్‍తో నిశ్చితార్థం విషయంలో జ్యోత్స్న ఆడిన నాటకాలన్నీ దీపకు తెలిసిపోతాయి. జ్యోత్స్న, పారిజాతం మాటలను చాటుగా విన్న కావేరి.. దీపకు అంతా చెప్పేస్తుంది. గౌతమ్‍తో పెళ్లి తంతును అడ్డుపెట్టుకొని కార్తీక్ జీవితం నుంచి దీపను దూరం చేయాలని జ్యో ప్లాన్ చేసుకొని ఉంటుంది. గౌతమ్ చెడ్డవాడని బయటపడకుండా సత్తిపండుతో జ్యోత్స్ననే నాటకం ఆడించిందని దీపకు తెలుస్తుంది. దీంతో జ్యో పని పట్టేందుకు శివన్నారాయణ ఇంటికి వెళ్లిన దీపకు అనుకోని షాక్ ఎదురవుతుంది.

దీపను ఇంటి బయటే అడ్డుకుంటుంది జ్యోత్స్న. నిజం చెప్పొద్దని బెదిరిస్తుంది. ఇంతలో చంపేస్తానంటూ తాత శివన్నారాయణ లైసెన్స్డ్ గన్ తీసుకొచ్చేందుకు జ్యో లోపలికి వెళుతుంది. దీప కర్ర పట్టుకొని ఇంట్లోకి వెళుతుంది. దీపకు జ్యో గన్...