భారతదేశం, జనవరి 28 -- కార్తీక దీపం 2 నేటి (జనవరి 28) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. శౌర్య ఆపరేషన్ కోసం సాయం అడిగేందుకు వచ్చిన తన ఆడపడుచు కాంచనకు తమ ఇంట్లో జరిగిన అవమానాన్ని తలచుకొని సుమిత్ర బాధపడుతుంది. సాయం కోసం వచ్చిన మనిషిని కన్నీళ్లతో పంపారని భర్త దశరథ్‍తో అంటుంది. పుట్టిళ్లు సుఖసంతోషాలతో ఉండాలని దీవించాల్సిన నోటితోనే.. తండ్రికే శాపనార్థాలు పెట్టేలా చేశారంటూ సుమిత్ర కన్నీరు పెడుతుంది. మావయ్య శివన్నారాయణను ఎందుకు నిలదీయలేకపోయారని దశరథ్‍ను ప్రశ్నిస్తుంది. అన్నగా కాంచనకు అండగా నిలబడాల్సిందని, పుట్టింటి ఆదరణ లేక ఎంత బాధపడి ఉంటుందోనని సుమిత్ర బాధపడుతుంది.

కార్తీక్, కాంచన, అనసూయ ఇంటికి వస్తారు. దీప ఓ చోట నీరసంగా, బాధగా కూర్చొని ఉంటుంది. ఏమైంది దీప ఇక్కడ కూర్చున్నావేంటి అని కార్తీక్ అడుగుతాడు. శౌర్య త్వరలోనే చచ్చిపోతుందని జ్యోత్స్న అన్న మాటలను ...