భారతదేశం, జనవరి 27 -- కార్తీక దీపం 2 నేటి (జనవరి 27) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. శౌర్య ఆపరేషన్ కోసం డబ్బు అడిగేందుకు వచ్చిన కూతురు కాంచనను చులకనగా మాట్లాడతాడు తండ్రి శివన్నారాయణ. డ్రామాలు ఆడుతున్నారనేలా మాట్లాడతాడు. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. శౌర్య కార్తీక్‍కు కూతురు ఎలా అవుతందని వెటకారంగా మాట్లాడతాడు శివన్నారాయణ దీనికి కార్తీక్ కౌంటర్ ఇస్తాడు.

మా అమ్మమ్మ చనిపోందని మీరు రెండో పెళ్లి చేసుకున్నారు.. పారు మా అమ్మని, మామయ్యను సొంత పిల్లల్లా చూసుకోలేదా. మావయ్య కూతురిని సొంత మనవరాల్లా చూసుకోవడం లేదా. పారు ఏమైనా వీరికి సొంత పిల్లలా. జ్యోత్స్న సొంత మనవరాలా" అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. జ్యోత్స్న తన సొంత మనవరాలే అని పారిజాతం మనసులో అనుకుంటుంది. బావ నిజాలే మాట్లాడుతున్నాడని జ్యోత్స్న అనుకుంటుంది. మీ కూతురు విషయంలో మీరు ఆలోచించినట్టు.. మీ భార్య...