భారతదేశం, మార్చి 31 -- కార్తీక దీపం 2 నేటి (మార్చి 31) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీప బాధపడుతూ ఉండగా.. అన్నం, కొత్త అవకాయ తీసుకొస్తాడు కార్తీక్. తిని కాంబినేషన్ ఎలా ఉందో చెప్పాలని అంటాడు. శౌర్య దుస్తులు ఇస్త్రీ చేస్తూ బాధపడుతున్న దీప.. తర్వాత తింటానంటుంది. కళ్లు కనిపించని భార్యకు ఓ భర్త అమరావతిని ఎలా చూపించాడోననే కథ చెబుతాడు కార్తీక్. ఇంకొకరి ఆకలి తీర్చేందుకు భార్యాభర్తల్లో ఒకరి చేతులు ఖాళీగా ఉంటే చాలని చెబుతాడు.

రౌడీ యూనిఫాం ఐరన్ చేసుకుంటూనే తిను అని కార్తీక్ అంటాడు. ఆకలి లేదని చెబుతుంది దీప. బాధ, ఆకలి శుత్రువులు దీప.. రెండూ ఒక చోట ఉండవని, బాధను తీసేయ్ అని సర్దిచెబుతాడు. బాధ ఎందుకు అని దీప అంటుంది. గౌతమ్ మంచి వాడు కాదు, వాడు జ్యోత్స్నకు భర్త అయితే ఏం జరుగుతుందో నాకు తెలుసు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది దీప. నిజం చెబితే ఎవరూ అర్థం చేసుకోవడ...