భారతదేశం, మార్చి 29 -- కార్తీక దీపం 2 నేటి (మార్చి 29) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న నిశ్చితార్థం చెడగొట్టావంటూ దీపను సుమిత్ర తిట్టిన తర్వాత.. కార్తీక్, కాంచన కూడా అసంతృప్తిగా మాట్లాడతారు. దీపను కార్తీక్ నిలదీస్తాడు. దీంతో జ్యోత్స్న పెళ్లి ఆగితే తనకు వచ్చే లాభమేంటని, తనను ఆమె చాలా రకాలుగా టార్చర్ చేసిందని కార్తీక్, కాంచనతో దీప చెబుతుంది. నా బావ జీవితం నుంచి తప్పుకో అని రెండు రోజులకు ఓసారి జ్యోత్స్న తనకు నరకం చూపించేదని ఏడుస్తూ చెబుతుంది దీప. జ్యోత్స్నను ఛీ అనిపించే అవకాశం వచ్చినా వదిలేశానని, సుమిత్రమ్మ కూతురు కాబట్టే వదిలేశానని అంటుంది. సుమిత్ర అంటే తనకు అంత గౌరవం అని అంటుంది.

"తలరాతలను రాసే మనుషులను ఈ దేవుడు భూమి మీదకు పంపుతాడంట. కానీ నాకు ఈ తలరాతలో కన్నతల్లిని కళ్లారా చూసుకునే అదృష్టం లేదు. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. స...