భారతదేశం, మార్చి 26 -- కార్తీక దీపం 2 నేటి (మార్చి 26) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీపే అసలైన వారసురాలు అని చెప్పేందుకు వచ్చిన దాసు.. శివన్నారాయణ శబ్దం చేయడంతో మళ్లీ గతం మరిచిపోతాడు. దాసును బయటికి తీసుకెళ్లండని శివన్నారాయణ అంటాడు. బయటికి వెళుతుండగా గౌతమ్ ఎదురుగా వచ్చిన అప్పుడు చూడదు దీప. దాసుకు మతిస్థిమితం లేదని, ఏమీ అనుకోవద్దని మగపెళ్లి వారితో శివన్నారాయణ అంటాడు. అలాంటి వారిపై జాలిపడాలని, కోపం వద్దని చెబుతాడు. వాళ్లను పంపించేసేయ్ అని పారిజాతానికి చెబుతాడు.

"ముందు గ్రానీని తన్నాలి. ఆ దాసును పిలవడం అవసరమా. నేను అసలైన వారసురాలిని కాదని ఎక్కడ చెబుతాడోనని భయపడి చస్తున్నా. పైగా అందరూ ఇక్కడే ఉన్నారు" అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. దాసును అత్తయ్య పిలవకుండా ఉండాల్సిందని సుమిత్ర అంటే.. తన కొడుకు కూడా ఉండాలనుకుందని కాంచన అంటుంది. మామయ్య దాసు పరి...