భారతదేశం, మార్చి 25 -- కార్తీక దీపం 2 నేటి (మార్చి 25) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. ముందు తరం ఆడపడుచు నువ్వైతే.. ఈ తరం ఆడపడుచు నేను అని అత్త కాంచనతో జ్యోత్స్న అంటుంది. తాను మారిపోయానని నమ్మించేందుకు మంచితనం నటిస్తుంది. మనమంతా ఒకటే, ఇది మన ఫ్యామిలీ అంటుంది. అందుకే వచ్చాం కదా అని కాంచన అంటుంది. జ్యోత్స్న సారి చెప్పి.. కాంచన ఒడిలో వాలుతుంది. బావ కావాలంటూ ఎన్నో అర్థం లేని పనులు చేసి అందరినీ బాధపెట్టానని ఎమోషనల్‍గా అంటుంది జ్యోత్స్న.

ఇప్పుడు నాకు నిశ్చితార్థమవుతోందని, పెళ్లై అత్తారింటికి వెళ్లిపోతానని, కానీ నన్ను మీరు మాత్రం తప్పు చేసిన మనిషిలాగే చూస్తారు కదా అని కాంచనను జ్యోత్స్న అడుగుతుంది. మా ఇష్టాలకు మాటలు తీసుకొని మీ మనసులను బాధపెట్టామని, తప్పు మాదేనని కాంచన సముదాయిస్తుంది. జ్యోత్స్న ఇంత మంచిగా మారిందేంటి అని మనసులో అనుకొని అనుమానిస్తుంది ...