భారతదేశం, మార్చి 24 -- కార్తీక దీపం 2 నేటి (మార్చి 24) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న నిశ్చితార్థానికి శివన్నారాయణ ఇల్లు ముస్తాబై ఉంటుంది. పారిజాతం హడావుడి చేస్తుంటుంది. ఈ క్రమంలో ఫోన్ మాట్లాడుతున్న శివన్నారాయణకు డాష్ ఇస్తుంది. దీంతో ఆయన కోప్పడతాడు. దశరథ అని శివన్నారాయణ పిలుస్తాడు. ఏర్పాట్లకు ఏ ఇబ్బంది లేదని దశరథ్ చెబుతాడు. నువ్వుండగా ఇబ్బంది ఏముండదని, అబ్బాయి వాళ్లను ఆహ్వానించేందుకు బయటకు పోదాం పదా అని శివన్నారాయణ అంటాడు. ఈ చీరలో చూసి సుమిత్రకు నన్ను అక్క అనుకుంటారేమోనని పారిజాతం మురిసిపోతుంది.

నిశ్చితార్థానికి వచ్చిన వారిని శివన్నారాయణ, దశరథ్, పారిజాతం ఆహ్వానిస్తుంటారు. నిశ్చితార్థం, పెళ్లితో పాటు జ్యోత్స్న అత్తారింట్లో అడుగుపెట్టే వరకు జాగ్రత్తగా ఉండాలని దశరథ్‍తో శివన్నారాయణ అంటాడు. "నా భయం కూడాఅదే నాన్న. ఓ తండ్రిగా నా కూతురిని ...