భారతదేశం, ఫిబ్రవరి 11 -- కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 11) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దేవుడి దయవల్ల తన కూతురు శౌర్య ప్రాణాలతో బయయపడిందని, సంతోషంగా హోమం చేసుకుంటుంటే ఈ మనిషి వచ్చి దానికి విలువ లేకుండా చేశాడు అని తండ్రి శ్రీధర్‌పై కార్తీక్ ఆగ్రహిస్తాడు. నిజానికి నువ్వు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది దేవుడికి కాదు.. నాకు అని శ్రీధర్ అంటాడు. నిజం చెబితే అది మీ అందరికీ పడుతుందని చెబుతాడు. నీ కూతురు ఆపరేషన్‍కు డబ్బు ఎవరు ఇచ్చారని అంటాడు. కావేరినే సాయం చేసిందని శ్రీధర్‌కు తెలిసిపోయిందా అని దీప కంగారు పడుతుంది. ఇంతలోనే నిజం చెప్పేస్తాడు శ్రీధర్.

శౌర్య ఆపరేషన్‍కు డబ్బు సాయం చేసేంది ఎవరో తెలుసా అని కార్తీక్‍ను శ్రీధర్ అడుగుతాడు. నీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ కార్తీక్. పోనీ నేను చెప్పనా అని శ్రీధర్ అంటాడు. ఈయనకు ఎలా తెలుసునని శ్రీధర్ సవతి భార్య, డబ్బు...