Hyderabad, ఫిబ్రవరి 22 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో చెవిపోగు కారులో లేదు బయట లేదు. ఒకవేళ దాస్ ఇంట్లో పడిపోయిందా. డాడీ ఇంతవరకు ఇంటికి ఎందుకు రాలేదు. దాసు నిజం చెప్పేసి ఉంటాడా. సరిగ్గా అదే టైమ్‌కు బావ కాశీ వచ్చారు. దాసు నిజం చెప్తే డాడీతోపాటు అందరికి తెలిసిపోయి ఉంటుంది కదా. అటు నుంచి అటు వెళ్లి పోలీస్‌లకు నా మీద కంప్లైంట్ ఇవ్వలేదు. ఇలా ఆలోచిస్తూ భయపడే బదులు ఒకసారి దాస్ ఇంటికి వెళ్లడమే కరెక్ట్ అని జ్యోత్స్న అనుకుంటుంది.

కిందకు వచ్చిన జ్యోత్స్నకు దశరథ్ ఎదురుపడతాడు. దాంతో ఆగిపోతుంది. డాడీకి ఇంకా నిజం తెలిసినట్లు లేదు అనుకుంటుంది జ్యోత్స్న. ఎక్కడికి వెళ్లారు డాడ్ ఆఫీస్‌కా అని జ్యోత్స్న అంటే.. నేను ఎక్కడికి వెళ్లానో నీకు తెలియదా. నేను వెళ్లింది నువ్ చూస్తే నీకు తెలుస్తుంది లేకుంటే ఎలా తెలుస...