భారతదేశం, ఫిబ్రవరి 14 -- కార్తీక్ సంత‌కాలు పెట్టిన పేప‌ర్స్ కోసం శ్రీధ‌ర్ వెతుకుతుంటాడు. తాను పెట్టిన చోట అవి క‌నిపించ‌క‌పోవ‌డంతో కంగారు ప‌డ‌తాడు. మీరు ఎంత వెతికిన పేప‌ర్స్‌ దొర‌క‌వ‌ని, వేరే చోట సేఫ్‌గా పెట్టాన‌ని కావేరి అంటుంది. వాటితో డ‌బ్బులు ఏం రావ‌ని, నిన్ను క‌లిపేసుకున్నార‌ని మురిసిపోవ‌ద్ద‌ని భార్య‌పై సెటైర్లు వేస్తాడు శ్రీధ‌ర్‌,

న‌న్ను అస్త‌మానం విసిగిస్తే అని కావేరి అన‌గానే...నువ్వు కూడా కార్తీక్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోతావా...అయినా నిన్ను ఎవ‌రూ రాణిస్తారు. నేను అనే వాడిని లేక‌పోతే మీరంతా ఎక్క‌డి నుంచి వ‌చ్చార‌ని బిల్డ‌ప్‌లు ఇస్తాడు శ్రీధ‌ర్‌.

అప్పుడే శ్రీధ‌ర్ ఫ్రెండ్ గంగాధ‌రం ఫోన్ చేస్తాడు. త‌న మ‌న‌వ‌డి పుట్టిన రోజుకు స‌తీస‌మేతంగా రావాల‌ని అంటాడు. ఆ బ‌ర్త్‌డే ఫంక్ష‌న్‌కు వెళ‌దామ‌ని కావేరితో అంటాడు శ్రీధ‌ర్‌. నేను రాన‌ని, అక్క‌తో వెళ...