భారతదేశం, ఏప్రిల్ 2 -- కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 2) ఎపిసోడ్‍ ఇలా: గౌతమ్ చెడ్డోడని నిరూపించేందుకు రమ్యను శివన్నారాయణ ఇంటికి తీసుకొస్తుంది దీప. నిన్ను మోసం చేసింది గౌతమ్ అనే నిజాన్ని చెప్పాలని రమ్యతో అంటుంది దీప. రమ్య మాత్రం 'నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి' అంటూ నానుస్తూ ఉంటుంది. గౌతమ్ పేరు మాత్రం చెప్పదు. చెప్పిందే ఎందుకు చెబుతున్నావ్.. పూర్తిగా చెప్పు అని పారిజాతం చిరాకు పడుతుంది. రమ్య నిజం చెప్పేందుకు రెడీ అవుతుంటే.. సత్తిపండు అనే వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు.

సత్తిపండు రాగానే ధీమాగా చేతులు కట్టుకుంటుంది జ్యోత్స్న. ఎవడ్రా నువ్వు అని పారిజాతం అంటుంది. ఇదిగో ఈ రమ్య మొగుడిని అని అబద్ధం చెబుతాడు సత్తిపండు. భలే టైమ్‍కు వచ్చావ్ రా నువ్వు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఏం నువ్వు రమ్య భర్తవా అని దీప ప్రశ్నిస్తుంది. ఏంటి రమ్య అలా చూస్తున్...