భారతదేశం, ఏప్రిల్ 15 -- కార్తీక దీపం 2 నేటి ఏప్రిల్ 15వ తేదీ ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీప చేతిలో రివాల్వర్ ఉండగా దశరథ్‍కు బుల్లెట్ గాయమైందని కాంచన, అనసూయకు కార్తీక్ చెబుతాడు. దీంతో వారిద్దరూ షాక్ అవుతారు. దీపను పోలీసులు అరెస్ట్ చేశారని కార్తీక్ చెబుతాడు. దీప కాల్చడమేంటి బాబు అని అనసూయ అడుగుతుంది. "నేను కాల్చలేదని దీప అంటోంది.. దీప వల్లే గాయమైందని వాళ్లు అంటున్నారు. సరిగ్గా నేను వెళ్లే సరికి దీప చేతిలో గన్ ఉంది. మామయ్యకు గాయమైంది" అని కార్తీక్ బాధగా చెబుతాడు. అన్నయ్యకు ఎలా ఉంది.. ఆసుపత్రికి వెళదాం పదా అని కాంచన అంటుంది.

దశరథ్‍ను చూసేందుకు ఆసుపత్రికి వెళతామని కాంచన అంటే వద్దంటాడు కార్తీక్. రావొద్దన్నారని అంటాడు. ఎవరు రావొద్దన్నారని కాంచన అడుగుతుంది. తాత అని కార్తీక్ చెబుతాడు. మేం తోడబుట్టిన వారం, ఆయన ఎవర్రా అని కాంచన బాధగా అంటుంది. మా అన...