భారతదేశం, ఏప్రిల్ 1 -- కార్తీక దీపం 2 నేటి ఏప్రిల్ 1వ తేదీ ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. గౌతమ్ చేతిలో మోసపోయిన రమ్య అడ్రెస్‍ను దీప సంపాదిస్తుంది. ఆ అమ్మాయి పేరు రమ్య.. మణికొండ కొత్తపేటలో ఉంటుంది.. ఎలాగైనా పట్టుకోవాలని వేగంగా నడిచివెళుతుంటుంది దీప. ఇంతలో ఓ కారు ఆమె ముందు వచ్చి ఆగుతుంది. దాంట్లో నుంచి శ్రీధర్ దిగుతాడు. వంటలక్క గారు.. ఏంటి అంత హడావుడిగా వెళుతున్నారు.. ఎవరిదైనా పెళ్లి చెడగొట్టాలా, పచ్చని సంసారంలో పెట్రోల్ పోసి తగలబెట్టాలా అంటూ వెటకారంగా మాట్లాడతాడు శ్రీధర్. అంతే గట్టిగా బదులిస్తుంది దీప.

మనిషిని మోసం చేయడం తప్పు.. నమ్మించి మోసం చేయడం పాపం.. ఈ రెండు మీరు చేశారు అని శ్రీధర్‌కు కౌంటర్ వేస్తుంది దీప. నా జీవితం, నా కొడుకు జీవితం, నా మేనకోడలు జీవితం నాశనం చేశావ్.. నాకు ఉన్న శత్రువు నువ్వే అంటూ నానా మాటలు అంటాడు శ్రీధర్. కొన్నింటికి స...