భారతదేశం, మార్చి 8 -- కార్తీక దీపం 2 నేటి (మార్చి 8) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. జోత్స్న రెస్టారెంట్‍లో పని చేసే ముఖ్యమైన ఉద్యోగులు కొందరు కార్తీక్ దగ్గరికి వస్తారు. కార్తీక్ కంపెనీలో చేరతామంటారు. జ్యోత్స్న గ్రూప్ కంపెనీలోనే పని చేయాలని సర్దిచెబుతాడు కార్తీక్. "మీరంతా జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ వర్కర్స్. ఎంతో కాలంగా ఆ సంస్థలోనే నమ్మకంగా పని చేస్తున్నారు. అక్కడ పని మానేసి మా రెస్టారెంట్‍లో జాయిన్ అవుతానంటే తప్పకుండా తీసుకోవాలి. కానీ తీసుకోలేను. ఎందుకంటే అది న్యాయం కాదు" అని కార్తీక్ అంటాడు.

జీతాలు సరిపోవడం లేదని అందుకే కంపెనీ మారాలని అనుకుంటున్నామని కార్తీక్‍తో చెబుతారు జ్యోత్స్న రెస్టారెంట్ ఉద్యోగులు. జ్యోత్స్న చెప్పిన వినడం లేదని అంటారు. చైర్మన్ శివన్నారాయణను అడగాలని కార్తీక్ అంటే.. ఏది ఉన్నా సీఈవో జ్యోత్స్ననే అడగాలని చెబుతున్నారని...