భారతదేశం, మార్చి 7 -- కార్తీక దీపం 2 నేటి (మార్చి 7) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. కార్తీక్ రెస్టారెంట్‍లో తింటారు శ్రీధర్, కావేరి. చిన్నమ్మ కావేరి తిన్నదానికి బిల్ వద్దని, నువ్వు తిన్న సగం బిల్ కట్టాలని తండ్రి శ్రీధర్‌తో కార్తీక్ చెబుతాడు. రూ.620 బిల్ కట్టే వెళ్లాలని చెబుతాడు. తాను ఫోన్ మరిచిపోయానని శ్రీధర్ అంటాడు. కావేరిని కట్టాలని చెబుతాడు. దీపను నానా మాటలు అన్నందుకు బుద్ధి చెప్పాలని అనుకున్న కావేరి.. తాను కూడా ఫోన్ తీసుకురాలేదని అంటుంది. తర్వాత ఇవ్వండని దీప అంటే.. కట్టాల్సిందేనని కార్తీక్ అంటాడు. అందరినీ ఇలాగే అంటే మనం చిన్నమ్మ ఇచ్చిన రూ.41లక్షల బాకీ ఎప్పుడు తీర్చాలని శ్రీధర్‌కు కౌంటర్లు వేస్తాడు కార్తీక్.

బిజినెస్ ఎలా రన్ అవుతుందో చూడడానికి వచ్చానని నేను అన్న మాటను తిప్పి అప్పజెబుతున్నాడు అని శ్రీధర్ కోప్పడతాడు. మాటలు కూడా అప్పు లాంటివ...