భారతదేశం, మార్చి 6 -- కార్తీక దీపం 2 నేటి (మార్చి 6) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. చిన్నప్పుడు తనను కాపాడిన ప్రాణదాత దీపే అని నిజం తెలిసినా నిజం చెప్పకూడదని కార్తీక్ అనుకుంటాడు. దీపే చెప్పేలా చేస్తానని ఆలోచిస్తాడు. "నువ్వు బయటపడవని అర్థమైంది దీప. మరి నేనెందుకు బయటపడాలి. నువ్వు నాతో దాగుడుమూతలు ఆడినట్టు.. నేను నీతో దాగుడుమాతలు ఆడతా. నీ అంతట నువ్వే నేనే మీ ప్రాణదాతను కార్తీక్ బాబు అని చెప్పేలా చేస్తాను. నాలో కొత్త కార్తీక్‍ను చూస్తావ్" అని లాకెట్ చూస్తూ అనుకుంటాడు కార్తీక్.

దీప తనను కొట్టి తీరు, ఇచ్చిన వార్నింగ్‍లను గుర్తు చేసుకొని జ్యోత్స్న కంగారు పడుతూ ఉంటుంది. ఆధారాలు తెస్తానని, వదలనని దీప ఇచ్చిన హెచ్చరిక గురించి ఆలోచిస్తుంది. ఆధారాలు దొరికితే దీప కాదు.. మా మమ్మీనే కొట్టి పోలీసులకు అప్పగించేలా ఉంది అని మనసులో అనుకుంటుంది. ఇంతలో పారిజాతం అక...