భారతదేశం, మార్చి 5 -- కార్తీక దీపం 2 నేటి (మార్చి 5) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. తాను జ్యోత్స్నపై కోపంతో అరిచానని, కొట్టానని కార్తీక్‍తో దీప చెబుతుంది. ఏం చేసినా సుమిత్రతో పాటు శివన్నారాయణ ఇంట్లో ఎవరూ నమ్మలేదని దీప అంటుంది. తనపై, శౌర్యపై జ్యోత్స్న దాడి చేసిందంటే నమ్మకుండా ఆధారాలు అడిగారని చెబుతుంది. "నీ కూతురు సాక్ష్యం సరిపోదు. నా కూతురు తప్పు చేసిందనడానికి ఆధారం ఉందా అని సుమిత్రే నన్ను అడిగారు. ఆధారాలను ఎక్కడి నుంచి తీసుకురావాలి. ఎలా నిరూపించాలి" అని దీప అంటుంది.

సరైన ఆధారాలు, సాక్ష్యాలు కావాలన్నారు కదా.. పోలీస్ స్టేషన్‍కు వెళదాం పదా అని కార్తీక్ అంటాడు. నా భార్యను, కూతురిని చంపాలనుకుందని జ్యోత్స్నపై పోలీస్ స్టేషన్‍‍లో కంప్లైట్ ఇస్తానని చెబుతాడు. రెండు కుటుంబాలను కలిపేందుకు తాను ప్రయత్నిస్తున్నానని, ఏం చేసినా తనను, తన చెల్లిని దృష్టిలో ప...