భారతదేశం, మార్చి 4 -- కార్తీక దీపం 2 నేటి (మార్చి 4) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. తనను, తన కూతురు శౌర్యను చంపేందుకు ప్రయత్నించిన జ్యోత్స్నను చితకబాదేస్తుంది దీప. ఇంట్లో అందరి ముందే కొడుతుంది. ఏమీ తెలియనట్టు అమాయకంగా ఫేస్ పెట్టి నాటకం ఆడుతుంది జ్యోత్స్న. ముక్కపచ్చలు ఆరని పసిదాన్ని చంపడానికి.. నీకు మనసు ఎలా వచ్చిందే.. నువ్వు మనిషివా పశువువా అని దీప ఫైర్ అవుతుంది. దీపపై సుమిత్ర ఫైర్ అవుతుంది. నా కూతురిని కొడతావా అంటూ కోప్పడుతుంది. నన్ను, శౌర్యను జోత్స్న చంపాలని చూసిందని, తనకు మత్తు పెట్టింది జ్యోత్స్న అని దీప చెబుతుంది. దీపపై శివన్నారాయణ, సుమిత్ర ఫైర్ అవుతారు.

ఆ మత్తులో ఉండే మాట్లాడుతున్నావా అని దీపతో శివన్నారాయణ అంటాడు. కాదు అని దీప అరుస్తుంది. "లేకపోతే ఏంటే.. ఉదయం నుంచి నా కూతురు నా గదిలోనే ఉంది. నేను దగ్గర ఉండి దానికి సేవలు చేశా. నా కూతురు...