భారతదేశం, మార్చి 3 -- కార్తీక దీపం 2 నేటి (మార్చి 3) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీప, శౌర్యపై దాడి చేసేందుకు వచ్చిన రౌడీలను కార్తీక్ చితకబాదేస్తాడు. జ్యోత్స్న పురమాయించిన గూండాలను కొట్టేస్తాడు. ముందుగా కార్తీక్ తలపై కర్రతో ఓ రౌడీ కొడతాడు. ఆ తర్వాత కార్తీక్ అందరినీ ఫటాఫటా బాదేస్తాడు. దీంతో నువ్వేమైనా రౌడీవా అని ఓ గూండా అంటే.. నీ లాంటి వెధవల తాటి తీసే రౌడీనే అంటూ కార్తీక్ అంటారు. ఎవరు పంపారని అడుగుతాడు. జైలులో ఉన్న ఆ వెధవేనా (నరసింహం) అంటూ రౌడీలను ప్రశ్నిస్తాడు.

రౌడీలు తలపై కొట్టడంతో దీప స్పృహ లేకుండా పడి ఉంటుంది. కార్తీక్, శౌర్య.. దీప వద్దకు వెళతారు. అమ్మా..అమ్మా అని శౌర్య పిలుస్తుంది. దీంతో స్పృహలోకి వచ్చిన శౌర్య అంటుంది. కార్తీక్ రావడంతో అక్కడి నుంచి జ్యోత్స్న పారిపోతుంది. ఇంట్లోకి గోడ దూకి వచ్చి.. సుమిత్ర బెడ్‍రూమ్‍లో పడుకుంటుంది. బయటిక...