Hyderabad, మార్చి 28 -- Karthika deepam 2 serial march 28th episode: యువరాణిలా బతకాల్సిన దీప పారిజాతం చేసిన కుట్ర వల్ల పేదింటి బిడ్డగా మారిపోతుంది. డబ్బా వాలాగా మారి జీవనం సాగిస్తుంది. తన కూతురికి సైకిల్ కొనివ్వాలనే ఆశతో డబ్బులు కూడబెడితే వాటిని తన అత్త అనసూయ లాగేసుకుంటుంది. నీ మొగుడు చేసిన అప్పులు తీర్చాలని చెప్పి దీపని నానా మాటలు అంటుంది.

కూతురిని సంతోషపెట్టడం కోసం జాతరకు తీసుకెళ్తుంది. సైకిల్ కొనివ్వమని శౌర్య గొడవ చేస్తుంది. మా నాన్న ఉంటే ఇలా చేసేవాడా? అని శౌర్య అనేసరికి దీప తన దీన స్థితిని తలుచుకుని కన్నీళ్ళు పెడుతుంది. తల్లిని శౌర్య ప్రేమగా ఓదారుస్తుంది. జాతరలో సైకిల్ పోటీలు నిర్వహిస్తారు. అందులో పోటీ చేయమని శౌర్య అడిగితే సరే అని బరిలోకి దిగుతుంది. ఆడదానివి మాతో ఎందుకు పోటీ అని మగవాళ్ళు హేళనగా మాట్లాడతారు. సైకిల్ పోటీలో మనల్ని ఎవర్ర...