భారతదేశం, మార్చి 22 -- కార్తీక దీపం 2 నేటి (మార్చి 22) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న నిశ్చితార్థానికి తన పుట్టింటి నుంచి ఎవరైనా వస్తారేమోనని వేచిచూస్తుంటుంది కాంచన. బంధాలు నిలబడాలంటే రాజీ పడాలని, కానీ ఎవరికి ఆ మనస్తత్వం లేదని, కానీ ప్రేమలు ఉన్నాయని కార్తీక్ అంటాడు. వద్దనుకునే వారి కోసం ఎదురుచూడొద్దని, ఎవరూ రారు చెబుతాడు. ఇంతలో కార్తీక్ ఇంటికి కాంచన అన్న దశరథ్, వదిన సుమిత్ర వస్తారు. వారిని చూసి కాంచన సంతోషిస్తుంది. పారిజాతం కూడా అడుగుపెడుతుంది. స్వయాన మీ నాన్నే వచ్చారని కాంచనతో పారు అంటుంది. ఏంటి నాన్న వచ్చాడా అని సంబరపడుతుంది కాంచన. సంతోషంగా వీల్‍చైర్‌లో నుంచి లేచేందుకు ప్రయత్నిస్తుంది. గుమ్మం దగ్గరే శివన్నారాయణ నిలబడి ఉంటాడు.

అక్కడే ఆగిపోయావే.. లోపలికి రా నాన్న అని శివన్నారాయణను కాంచన పిలుస్తుంది. మనం కలవడం అంటూ జరిగితే ముందుగా న...