భారతదేశం, మార్చి 10 -- కార్తీక దీపం 2 నేటి (మార్చి 10) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. ఆస్తులను పంచేందుకు శివన్నారాయణ వీలునామా రాశాడని చెప్పేందుకు కార్తీక్ ఇంటికి వస్తాడు శ్రీధర్. తన భార్య కాంచన, కొడుకు కార్తీక్‍కు ఈ విషయం చెప్పి వాటా దక్కేలా గొడవ పెట్టాలనే ప్లాన్‍తో అడుగుపెడతాడు. టిఫిన్ బండిపై మిర్చీ పునుగులు వేద్దామనుకుంటున్నామని అనసూయ అంటుంటే.. శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. కోట్లకుకోట్లు చేజారిపోయేలా ఉన్నాయని చెబుతాడు. ఇంతలో కావేరి కూడా వస్తే కుర్చీ వేసి మర్యాదలు చేస్తుంది దీప. తనను పట్టించుకోవాలని శ్రీధర్ అడుగుతాడు. వీలునామా విషయం చెబుతాడు.

సమయానికి బాగా వచ్చావని, లేకపోతే కార్తీక్, దీప రెస్టారెంట్‍కు వెళ్లిపోయేవారని సవతి కావేరితో అంటుంది కాంచన. కాఫీ తెమ్మంటారా అని అనసూయ అడిగితే.. చీపురు కట్ట అనసూయ బూజులు దులుపుకో అని వెటరిస్తాడు శ్రీధర్. కార్తీ...