భారతదేశం, ఫిబ్రవరి 8 -- కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 8) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. శౌర్య ఆపరేషన్ జరిగిన సందర్భంగా నిర్వహించే హోమానికి కావేరికి ఆహ్వానం పలుకుతుంది దీప. ఆపరేషన్ కోసం డబ్బు ఇచ్చిన కావేరికి ఆప్యాయంగా బొట్టు పెట్టి పిలుస్తుంది. తప్పకుండా రావాలని అంటుంది. ఇదంతా బయటి నుంచే చూస్తాడు శ్రీధర్. దీప ఇంటికి ఎందుకొచ్చిందేంటి, నా పెళ్లానికి బొట్టు పెడుతోందేంటి అని ఆలోచిస్తుంటాడు. దీప అక్కడి నుంచి వెళ్లి వెంటనే ఇంట్లోకి వస్తాడు శ్రీధర్.

ఇంటికెవరో వచ్చినట్టు ఉన్నారు అని కావేరి శ్రీధర్ ప్రశ్నిస్తాడు. ఎక్కడో ఏదో హోమం ఉందంట, పిలవడానికి వచ్చారని బదులిస్తుంది కావేరి. ఇంతకీ ఎవరో వచ్చిన వాళ్లు అని శ్రీధర్ ప్రశ్నిస్తాడు. నాకు కావాల్సిన వాళ్లు అని కావేరి అంటుంది. అంతకావాల్సిన వాళ్లా.. ఎవరో వాళ్లు అని సాగదీస్తాడు శ్రీధర్. పేరేంటి.. వరుసేంటి అని ప్...